యుద్ధ ప్ర‌భావం.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

February 25th Gold rate.ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా ప‌సిడి ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. దీంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2022 2:38 AM GMT
యుద్ధ ప్ర‌భావం.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా ప‌సిడి ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. దీంతో ప‌సిడి ధ‌ర భారీగా పెరిగింది. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో ప‌సిడి ధ‌ర పెరిగిన‌ప్ప‌టికీ కొనుగోళ్లు చేయ‌క‌త‌ప్ప‌డం లేదు. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర ఏకంగా రూ.1400 వ‌ర‌కు పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల త‌గ్గుద‌ల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,010

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,600

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల ధర రూ.51,550

వెండి ధ‌ర‌లు..

కిలో వెండి ధ‌ర‌ ఢిల్లీలో రూ. 66,000, ముంబైలో రూ. 66,000, చెన్నైలో ధర రూ. 72,700, కేరళలో రూ. 72,700, హైదరాబాద్‌లో రూ. 72,700, విజయవాడలో రూ. 72,700, విశాఖపట్నంలో రూ.72,700 గా ఉంది.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.


Next Story