మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన ప‌సిడి ధ‌ర

February 22nd Gold Price.ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోళ్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2022 3:03 AM GMT
మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన ప‌సిడి ధ‌ర

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు నేడు దిగివ‌చ్చాయి. ఆదివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.90 వ‌ర‌కు త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల త‌గ్గుద‌ల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050 వ‌ద్ద కొన‌సాగుతోంది. వెండి ధ‌ర కూడా స్వ‌ల్పంగా పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,270, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,570

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,050

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల ధర రూ.50,050

వెండి ధ‌ర‌లు..

దేశీయ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ఢిల్లీలో రూ. 64,000, ముంబైలో రూ. 64,000, చెన్నైలో ధర రూ. 68,200, కోల్‌కతాలో రూ.63,800, కేరళలో రూ. 70,000, హైదరాబాద్‌లో రూ. 70,700, విజయవాడలో రూ. 70,000, విశాఖపట్నంలో రూ.70,000 గా ఉంది.

Next Story