పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో ఎంతంటే
February 16th Gold Price.పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతూ
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2022 1:43 AM GMTపసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. అందుకనే పసిడి కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న తగ్గిన పసిడి ధర నేడు పెరిగింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా పసిడి ధరల తగ్గుదల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల ధర రూ.50,620
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.