మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
February 13th Gold Price.పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధర తగ్గితే..
By తోట వంశీ కుమార్ Published on 13 Feb 2022 2:12 AM GMTపసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతూ ఉంటుంది. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధర నేడు భారీగా పెరిగింది. ఆదివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.1000 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా పసిడి ధరల పెరుగుదల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర కిలో రూ.400 మేర పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,530, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,760
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల ధర రూ.51,050
వెండి ధరలు
కిలో వెండి.. ఢిల్లీలో రూ.63,000, ముంబైలో రూ. 63,000, చెన్నైలో రూ. 67,400, బెంగళూరులో రూ. 66,900, కేరళలో రూ.67,400,హైదరాబాద్‌లో రూ. 67,400, విజయవాడలో రూ. 67,400, విశాఖపట్నంలో రూ.67,400 గా ఉంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.