ఫేస్‌బుక్.. 3కోట్ల మంది యూజర్లకు షాక్ ఇస్తూ..!

Facebook Takes Down Over 30 Million Posts In Compliance With New IT Rules.సోషల్‌ మీడియా దిగ్గజం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2021 8:15 AM GMT
ఫేస్‌బుక్.. 3కోట్ల  మంది యూజర్లకు షాక్ ఇస్తూ..!

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సంస్థ కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్‌పై వేటు వేసింది. భారతదేశంలో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తన తొలి నెలవారీ కంప్లయిన్స్‌ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఐటీ నిబంధనల ప్రకారం దేశంలో మే 15 - జూన్ 15 మధ్యకాలంలో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించామని ఫేస్ బుక్ సంస్థ తెలిపింది.

స్పామ్ (25 మిలియన్లు), హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ (2.5మిలియన్లు), వయోజన నగ్నత్వం, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్లు కంటెంట్ ను డిలీట్ చేశారు. ఉగ్రవాద ప్రచారానికి సంబంధించి 106,000 పోస్ట్‌లు, విద్వేషపూరిత ప్రసంగాలపై 311,000, వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ 118,000 పోస్ట్‌లు ఉన్నాయి. దీంతో భారత్ లోని కొత్త ఐటీ చట్టాల ప్రకారం ఫేస్ బుక్ అలాంటి కంటెంట్ ను డిలీట్ చేసేసింది. ఫేస్‌బుక్ కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్‌ను తొల‌గించింది. తమ తదుపరి నివేదికను జూలై 15న ప్రచురిస్తామని.. అందులో వినియోగదారుల ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలుంటాయని తెలిపింది.

Next Story