ఫేస్‌బుక్‌ మాతృసంస్థ పేరు మార్పు.. ఇకపై 'మెటా'

Facebook is changing its name to Meta.ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2021 3:02 AM GMT
ఫేస్‌బుక్‌ మాతృసంస్థ పేరు మార్పు.. ఇకపై మెటా

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు పేస్‌బుక్‌గా ఉన్న పేరును మారుస్తున్న‌ట్లు పేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ తెలిపారు. ఇకపై దాన్ని 'మెటా'గా పిల‌వ‌నున్నారు. పేరు మార్పున‌కు గ‌ల కార‌ణాల‌ను ఆయ‌న వివ‌రించారు. భ‌విష్య‌త్తులో వ‌ర్చువ‌ల్ రియాలిటీ సాంకేతిక‌(మెటావ‌ర్స్‌)కు కు ప్రాధాన్యం పెర‌గ‌బోతుంద‌ని.. దానిని దృష్టిలో ఉంచుకునే పేరును మార్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కాగా.. పేస్‌బుక్‌తో పాటు కంపెనీ ఆధీనంలో ఉన్న సామాజిక మాధ్య‌మాలు ఇన్‌స్ట్రాగ్రాం, వాట్సాప్ పేర్ల‌లో ఎటువంటి మార్పు ఉండ‌ద‌ని తెలిపారు. కేవ‌లం మాతృసంస్థ పేరును మార్చిన‌ట్లు వెల్ల‌డించారు.

మెటావర్స్ వేదిక వందకోట్ల మందికి అందుబాటులోకి వస్తుందని, ఈ విధానంలో ప్రజలు వ‌ర్చువ‌ల్‌గా క‌లుసుకుని, పనిచేసి, ఉత్పత్తులను తయారుచేస్తారన్నారు. త‌ద్వారా ల‌క్ష‌లాదామందికి ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నారు. తమ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్‌సెట్, హొరైజన్ వంటివి భాగంగా ఉన్నాయని... వీటన్నింటినీకి ఫేస్‌బుక్ పేరు స‌రిగ్గా అనిపించ‌డం లేద‌న్నారు. పేరు మారినా.. త‌మ ప‌ని మార‌ద‌న్నారు. గ‌త కొద్ది రోజులుగా ఫేస్‌బుక్ పేరును మారుస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌గా.. గురువారం అధికారికంగా దాని పేరు మారిపోయింది. కాగా.. సమా‌చార దుర్వి‌ని‌యోగం, సమా‌చార భద్రతపై ఆందో‌ళ‌నలు, విద్వే‌షాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ధ‌నాన్ని ఆర్జి‌స్తు‌న్నదన్న ఆరో‌ప‌ణల నేప‌థ్యంలో.. అంద‌రి దృష్టిని మ‌ర‌ల్చేందుకే జుక‌ర్ బ‌ర్గ్ ఫేస్‌బుక్ పేరును మార్చార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Next Story