సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు భారీ షాక్ తగిలింది. అడిగిన వివరాలు అందించకుండా జాప్యం చేస్తూ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినందుకు రూ.520 కోట్లు(50.5 మిలియన్ బ్రిటీష్ పౌండ్లు)ను బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటర్ జరిమానాగా విధించింది. చట్టం ముందు అందరూ సమానులే అని పేస్‌బుక్‌కు అక్షింతలు వేసింది.
అసలేం జరిగిందంటే.. గతేడాది బ్రిటన్‌కు చెందిన జిఫిని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. అయితే.. ఈ కొనుగోలు పై అనేక ఆరోపణలు వచ్చాయి. జిపి కొనుగోలు ద్వారా సోషల్ మీడియాల మధ్య పోటిని పేస్‌బుక్ నియంత్రిస్తుందనేది ముఖ్యమైన ఆరోపణ. వీటిపై కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎమ్‌ఏ) విచారణ చేపట్టింది. వివరాలు సమర్పించాలని పలుమార్లు పేస్‌బుక్‌ను కోరింది. అయితే.. పేస్‌బుక్ ఈ వివరాలు అందించలేదు.
దీంతో జిఫి కంపెనీతో ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగానే ఇంటిగ్రేట్ ఆపరేషన్స్ పాటించడంలో వైఫల్యమైందని సీఎమ్‌ఏ పరిగణించింది.పేస్‌బుక్ ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని.. ఇతర కంపెనీలు కూడా దీని నుంచి స్పూర్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దీంతో భారీ జరిమానా విధించింది. సీఎమ్‌ఏ విధించిన జరిమానాపై పేస్‌బుక్ స్పందించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. సీఎమ్ఏ తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించిన తరువాతే తదుపతి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.