ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫాం ట్విట్టర్ ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. ఇందుకోసం 44 బిలియన్ డాలర్లను ఆయన వెచ్చించారు. కొన్ని నెలలుగా సాగుతున్నసాగదీతకు గురువారం తెరపడింది. ఇక.. మస్క్ వచ్చీ రావడంతోనే ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. అంతేకాకుండా సీఎఫ్‌వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ విభాగాధిపతి విజయ గద్దె సహా మరికొంత మందిని తొలగించినట్లు సమాచారం.
నాటకీయ పరిణామాలు..
ఎలాన్ మస్క్ ఏప్రిల్ నెలలో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్దం అయ్యాడు. అయితే.. స్పామ్, నకిలీ బాట్ అకౌంట్ల సంఖ్యను ట్విట్టర్ తప్పుగా చూపించిందని ఆరోపిస్తూ ఆయన డీల్ నుంచి వెనక్కి తగ్గారు. దీంతో ట్విట్టర్ దావాకు వెళ్లింది. ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రావడానికి కోర్టు అక్టోబర్ 28 తుది గడువుగా విధించింది. మస్క్ కూడా మనసు మార్చుకున్నాడు. కోర్టు ఇచ్చిన గడువుకు ఒక రోజు ముందే కొనుగోలు పూర్తి అయ్యింది.