ఆదాయపు పన్ను నోటీసు వస్తే ఏం చేయాలి?
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. చాలా మంది ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు.
By అంజి Published on 12 Aug 2024 12:41 PM ISTఆదాయపు పన్ను నోటీసు వస్తే ఏం చేయాలి?
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. చాలా మంది ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొందరికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందవచ్చు. తమ రిటర్నులతో తప్పుడు సమాచారం అందించినా లేదా తప్పుడు క్లెయిమ్‌లు చేసిన వారికి ఈ నోటీసులు అందుతాయి. మరి ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు వస్తే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు వచ్చినప్పుడు.. ఎందుకు జారీ చేయబడిందో జాగ్రత్తగా చదవండి. ఎక్కువగా డిపార్ట్‌మెంట్ ఆదాయపు పన్ను చట్టం 1961లోని వివిధ సెక్షన్‌ల కింద కారణాలతో ఈ నోటీసులు జారీ చేస్తుంది. లేదంటే.. అదనపు సమాచారాన్ని అభ్యర్థించవచ్చు. లేదా బాకీ ఉన్న పన్నులను డిమాండ్ చేయవచ్చు. వాటన్నింటినీ సరిచేయండి. ఒకవేళ మీరు ఏ తప్పూ చేయకపోతే నోటీసులు ఖచ్చితమైన ప్రతిస్పందనను అందించండి. మీ వివరణతో శాఖ సంతృప్తి చెందితే, విషయం అక్కడితో క్లోజ్ అవుతుంది.
లేని పక్షంలో మీరు బకాయి ఉన్న పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే నోటీసు వచ్చినప్పుడు దాని ప్రామాణికతను ధృవీకరించడం కూడా ముఖ్యం. చట్టం- 1961 లోని పలు సెక్షన్ల కింద టాక్స్ పేయర్లకు నోటీసులు అందిస్తుంది. నోటీసులో పేరు, పాన్ నంబర్, మదింపు సంవత్సరం తనిఖీ చేయాలి. నోటీసు మీకు సంబంధించినదేనో కాదో నిర్ధరించుకోవాలి. ఐటీ వెబ్‌సైట్లో నోటీసు చెక్ చేయండి. దానిలోని సూచనల్ని అనుసరించి తదుపరి అడుగు వేయాల్సి ఉంటుంది.