జాయింట్ హోంలోన్ తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా?
ఇల్లు కొనాలంటే చాలా మంది లోన్లు తీసుకుంటారు. అయితే ఎక్కువగా సింగిల్ లోన్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు.
By అంజి
జాయింట్ హోంలోన్ తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా?
ఇల్లు కొనాలంటే చాలా మంది లోన్లు తీసుకుంటారు. అయితే ఎక్కువగా సింగిల్ లోన్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. రుణాలు అందించే ముందు బ్యాంకులు క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఎంప్లాయిమెంట్, వయసు లాంటి ఎన్నో విషయాలను పట్టించుకుంటాయి. ఒక వేళ వీటిలో ఏ ఒక్కటి తగ్గినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అందుకే హోమ్ లోన్ విషయంలో సింగిల్ కంటే జాయింట్ లోన్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. దగ్గరి వారు అంటే భార్య, కూతురు, కొడుకు వంటి వారికి కో అప్లికెంట్లుగా చేర్చుకొని జాయింట్ హోమ్ లోన్‌కి అప్లై చేయడం వల్ల లోన్ త్వరగా అఫ్రూవ్ అవుతుంది.
కొన్ని బ్యాంకులు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్‌లను కో అప్లికెంట్లుగా ఒప్పుకోవడం లేదు. కాబట్టి బ్యాంకు నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం ముఖ్యం. కో - అప్లికెంట్‌ను చేర్చుకోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. ఇలా ఇద్దరు కలిసి లోన్ తీసుకున్నప్పుడు.. మీకు ఆ లోన్‌పై ఎంత బాధ్యత ఉంటుందో, కో అప్లికెంట్‌కి కూడా అంతే ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉంటుందని బ్యాంకులు భావిస్తాయి.
సాధారణంగా లోన్ ఇచ్చేముందు బ్యాంకులు క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఎంప్లాయిమెంట్, వయసు లాంటి ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకుంటాయి. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి తగ్గినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అందుకే జాయింట్ లోన్ తీసుకోవడం మంచిది. దీనివల్ల లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. ఎక్కువ మొత్తంలో లోన్ రావడంతో పాటు తక్కువ ఈఎంఐలు ఉంటాయి. మీ వయసు ఎక్కువగా ఉంటే కో అప్లికెంట్‌ని చేర్చితే రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది.
ప్రైమరీ అప్లికెంట్, కో - అప్లికెంట్ ఇద్దరూ హోంలోన్ ఈఎంఐ కడుతున్నప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24-బి కింద ఈ మినహాయింపును ఇద్దరూ పొందవచ్చు. దీంతో పాటు 80 - సి కింద మరో 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. కొన్ని బ్యాంకులు మహిళలకు ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేటుకే రుణాలను అందిస్తున్నాయి. వారి పేరును కూడా జాయింట్ హోంలోన్‌లో చేర్చుకోవడం వల్ల తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయి. అయితే కొన్ని బ్యాంకులు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లను కో అప్లికెంట్లుగా ఒప్పుకోవడం లేదు. దీనిని గమనించి అప్లై చేయాల్సి ఉంటుంది.