యూపీఐ సర్కిల్ ఎలా పని చేస్తుందో తెలుసా?
చెల్లింపుల రంగంలో యూపీఐ చాలా మార్పులు తీసుకొచ్చింది. అలాగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్తగా యూపీఐ సర్కిల్‌ని కూడా ప్రవేశపెట్టింది.
By అంజి Published on 27 Sept 2024 1:39 PM ISTయూపీఐ సర్కిల్ ఎలా పని చేస్తుందో తెలుసా?
చెల్లింపుల రంగంలో యూపీఐ చాలా మార్పులు తీసుకొచ్చింది. అలాగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్తగా యూపీఐ సర్కిల్‌ని కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఆల్రెడీ కొన్ని పేమెంట్ యాప్స్‌లో నడుస్తోంది. మరి ఈ యూపీఐ సర్కిల్ ఎలా పని చేస్తుంది. దీని వల్ల లాభాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
మన కుటుంబ సభ్యులు, మిత్రులు అత్యవసర సమయాల్లో తమ ఖాతాలో కొంత డబ్బు వేయమని కాల్ చేస్తుంటారు. కానీ, అన్ని సందర్భాల్లో వారికి మనం అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే ఈ యూపీఐ సర్కిల్ ద్వారా మన పర్మిషన్ లేకుండానే, మన ఖాతా నుంచి వారు నేరుగా చెల్లింపులు జరపొచ్చు. ఇందుకు మనం మన పేమెంట్ యాప్స్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. మన ఖాతాను వారు వినియోగించుకుంటారు కాబట్టి వారు సెకండరీ యూజర్లుగా ఉంటారు. మనం ప్రైమరీ యూజర్‌గా ఉంటాము. అయితే ఓ ప్రైమరీ యూజర్ గరిష్ఠంగా ఐదుగురు సెకండరీ యూజర్లను మాత్రమే ఎంచుకోవచ్చు.
ఈ యూపీఐ సర్కిల్ ద్వారా సెకండరీ యూజర్లు అనవసర ఖర్చులు చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులను, నమ్మకమన మిత్రులను మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి
విత్ పర్మిషన్: సెకండరీ యూజర్ మీ ఖాతా నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని అప్రూవ్ చేయడం, చేయకపోవడం మీ చేతిలో ఉంటుంది.
విత్ అవుట్ పర్మిషన్: వారు లావాదేవీలు చేసేటప్పుడు మీ నుంచి ఎలాంటి పర్మిషన్ అడగదు. అయితే, విత్ అవుట్ పర్మిషన్‌లో మీరు లిమిట్‌కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే వారు పరిమితికి మించి డబ్బు వినియోగించుకోవడానికి వీలు ఉండదు.
యూపీఐ సర్కిల్ ద్వారా నెలకు గరిష్ఠంగా రూ.15 వేల వరకు వాడుకోవచ్చు. ఒకేసారి రూ.5 వేల కన్నా ఎక్కువగా లావాదేవీలు జరపలేము. మీ పేమెంట్ యాప్‌లో యూపీఐ సర్కిల్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. యాడ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ యూపీఐ ఐడీ ఎంటర్ చేయాలి. అలా వారిని మీ సర్కిల్‌లో యాడ్ చేసుకోవచ్చు.