ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ ఎలా ఇస్తారో తెలుసా?

మనకు బ్యాంకులో వ్యక్తిగత రుణం కావాలంటే.. మంచి సిబిల్‌ స్కోర్‌ ఉండాల్సిందే. సిబిల్‌ స్కోర్‌ లేకుంటే లోన్‌ రావడం కష్టం.

By అంజి  Published on  3 Jun 2024 8:00 AM GMT
pre approved loans, Personal Loan, Bank Information

ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ ఎలా ఇస్తారో తెలుసా?

మనకు బ్యాంకులో వ్యక్తిగత రుణం కావాలంటే.. మంచి సిబిల్‌ స్కోర్‌ ఉండాల్సిందే. సిబిల్‌ స్కోర్‌ లేకుంటే లోన్‌ రావడం కష్టం. అయితే, కొన్ని సందర్భాల్లో సిబిల్‌ స్కోర్‌ లేకున్నా రుణాలు అందుతాయి. అప్పుడప్పుడు మీకు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ప్రీ అఫ్రూవ్డ్‌ లోన్‌ శాన్షన్‌ అయిందంటూ మెసేజ్‌లు, కాల్స్‌ వచ్చే ఉంటాయి. అసలేంటీ ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌, వాటిని తీసుకోవడం మంచిదేనా? కాదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రీ అప్రూవ్డ్‌ లోన్‌ అంటే.. మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండా ఎక్కువ డాక్యుమెంటేషన్‌ లేకుండా బ్యాంకులే మీ ఆదాయం, చెల్లింపుల చరిత్ర, సిబిల్‌ స్కోర్‌ను చూసి మీకు వ్యక్తిగత రుణాలను ఆఫర్‌ చేస్తుంటారు. వాటినే ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ అంటారు. అంటే ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణం అని అర్థం.

ఇలా ముందుగా ఆమోదించిన రుణాలకు చాలా వరకు సెక్యూరిటీ ఉండదు. కాకపోతే ముందుగా ఆమోదించిన రుణానికి సమయ పరిమితి ఉంటుంది. అలాగే ముందుగానే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. సాధారణ వ్యక్తిగత రుణం కంటే ఈ ప్రీ అఫ్రూవ్డ్‌ లోన్స్‌ను సులభంగా పొందవచ్చు. కౌంటింగ్ రోజు కూడా వైసీపీ నేతలు అనేక అక్రమాలకు, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఎన్డీఏ నాయకులను చంద్రబాబు హెచ్చరించారు.

Next Story