SBI తీసుకొచ్చిన ఈ కొత్త స్కీమ్ గురించి తెలుసా?
దేశ ప్రజల్లో అత్యంత నమ్మకమైన బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం అదిరిపోయే పథకాన్ని ప్రవేశపెట్టింది.
By అంజి Published on 13 Jan 2025 12:09 PM ISTSBI తీసుకొచ్చిన ఈ కొత్త స్కీమ్ గురించి తెలుసా?
దేశ ప్రజల్లో అత్యంత నమ్మకమైన బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం అదిరిపోయే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎప్పటికప్పుడు సరికొత్త స్కీమ్స్‌ను లాంచ్ చేస్తూ డిపాజిటర్లను పెంచుకునే ఎస్‌బీఐ ఈ సారి 'హర్ ఘర్ లఖ్‌పతి' పేరిట రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా డిపాజిటర్లు ప్రతి నెలా కొద్ది మొత్తంలో పొదుపు చేయడం ద్వారా కాల వ్యవధి ముగిశాక ఒకేసారి రూ.లక్ష, అంతకన్నా ఎక్కువ రాబడి పొందవచ్చు. ప్రతి ఇంటిలో ఒక లక్షాధికారని ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకానికి ఆ పేరు పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు ఒక ప్రణాళిక ప్రకారం పొదుపు చేసుకునేందుకు వీలు ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అలవాటు అవుతుంది. ఈ పథకం కాల వ్యవధి మూడు నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. వడ్డీ రేటు సాధారణ పౌరులకు 6.5 శాతం నుంచి 6.75 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7 శాతం నుంచి 7.25 శాతం వరకు ఉంటుంది. ఎస్‌బీఐ ఉద్యోగులకు సాధారణ పౌరులకన్నీ 1 శాతం ఎక్కువ వస్తుంది. ఈ పథకంలో పదేళ్లు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా చేరవచ్చు.. అఖ్‌పతి ఆర్‌డీ పథకంలో వ్యక్తిగతంగా లేదా జాయింట్‌గానూ చేరొచ్చు. 10 ఏళ్లు నిండిన మైనర్లు కూడా వారి తల్లిదండ్రుల సంరక్షణలో ఈ పథకంలో చేరవచ్చు.
కాల వ్యవధి ముగియక ముందే విత్ డ్రా చేసుకుంటే 0.5 శాతం పెనాల్టీ చెల్లించాలి. రూ.5 లక్షల కన్నా ఎక్కువ రాబడి కోసం పథకంలో చేరి, మధ్యలోనే మీ డబ్బు ఉపసంహరించుకుంటే.. ఆ పెనాల్టీ 1 శాతం ఉంటుంది. సకాలంలో చెల్లింపులు చేయలేకపోతే.. ప్రతీ రూ.100కు నెలకు రూ.1.50 చొప్పున పెనాల్టీ విధించారు. వరుసగా ఆరు నెలల పాటు ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించకపోతే ఆ ఖాతాను మూసివేస్తారు. ఆ తర్వాత జమ అయిన డిపాజిట్ మొత్తాన్ని చందాదారుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు.