వాహ‌న‌దారుల‌కు ఊర‌ట‌.. త‌గ్గిన డీజిల్ ధ‌ర‌

Diesel Rate falls for 3rd consecutive day.ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గ‌త నాలుగు నెల‌లుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2021 5:11 AM GMT
వాహ‌న‌దారుల‌కు ఊర‌ట‌.. త‌గ్గిన డీజిల్ ధ‌ర‌

ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గ‌త నాలుగు నెల‌లుగా వ‌రుస‌గా పెరిగిన పెట్రోల్‌, డిజీల్ ధ‌ర‌లు ఇటీవ‌ల స్థిరంగా ఉంటున్నాయి. పెట్రోల్ ధరలు అలాగే ఉన్నా డీజిల్‌ ధరలు మాత్రం కాస్త మళ్లీ కిందికి దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా డీజిల్‌ ధర తగ్గింది. ఈ రోజు లీటర్‌ డీజిల్‌పై 20 పైసల మేర కోత పెట్టాయి ఆయిల్‌ సంస్థలు. దీంతో ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర 20 పైసలు తగ్గి రూ.89.27కి దిగివచ్చింది. పెట్రోల్‌ ధర రూ.101.84గా కొనసాగుతోంది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్ రూ.101.84, డీజిల్ రూ.89.27

- ముంబైలో పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.04

- చెన్నైలో పెట్రోల్‌ రూ.99.47, డీజిల్‌ ధర రూ. 93.84

- కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.08, డీజిల్‌ ధర రూ.92.52

- హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.105.83, డీజిల్‌ ధర రూ.97.33

Next Story