వెడ్డింగ్‌ ఇన్సూరెన్స్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి?

మన దేశంలో వెడ్డింగ్‌ ఇండస్ట్రీ, దాని అనుబంధం రంగాల వ్యాపారం సుమారు 50 బిలియన్‌ డాలర్లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్‌లో భారీ ఎత్తున బిజినెస్‌ జరుగుతుంది.

By -  అంజి
Published on : 31 Oct 2025 1:30 PM IST

wedding insurance, insurance, Wedding season

వెడ్డింగ్‌ ఇన్సూరెన్స్‌ గురించి తెలుసుకోండి?

మన దేశంలో వెడ్డింగ్‌ ఇండస్ట్రీ, దాని అనుబంధం రంగాల వ్యాపారం సుమారు 50 బిలియన్‌ డాలర్లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్‌లో భారీ ఎత్తున బిజినెస్‌ జరుగుతుంది. అయితే కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల పెళ్లిళ్లు ఆగిపోతాయి. అలాంటి ఈవెంట్లు ఆగిపోవడం వల్ల ఏర్పడే నష్టాన్ని భరించేందుకు తగిన రక్షణ అనేది ఉండాల్సిందే. దానికి వెడ్డింగ్‌ ఇన్సూరెన్స్‌ అనేది పరిష్కారం చూపిస్తుందంటున్నాయి ఇన్సూరెన్స్‌ కంపెనీలు. ఏదైనా అనుకోని సంఘటన ఎదురై పెళ్లి రద్దైనా, ఆగిపోయినా, వాయిదా పడినా ఆర్థికంగా నష్టపోకుండా ఈ పాలసీ రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు పెళ్లి ఆగిపోవడంతో ఏర్పడిన ఖర్చును మాత్రమే కాకుండా, వెడ్డింగ్‌ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగినా దానికి సైతం బీమా కవరేజీ అందిస్తుంది. ఇందులో నాలుగు రకాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాన్సిలేషన్‌ కవరేజ్‌

చివరి నిమిషంలో వేడుక రద్దు లేదా వాయిదా పడినా దీన్ని వినియోగించుకోవచ్చు. దీని ద్వారా వచ్చే నగదుతో ఈవెంట్‌ని రీషెడ్యూల్‌ చేయడానికి సంబంధించిన అదనపు ఖర్చులకు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తుంది. సాధారణంగా ఆకస్మిక అనారోగ్యం లేదా ముఖ్య వ్యక్తుల మరణం, వేదికను ఉపయోగించలేని వాతావరణ పరిస్థితులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది.

లయబిలిటీ కవరేజ్‌

వివాహ వేడుకలో సంభవించే ప్రమాదాలు, గాయాలు లేదా ఆస్తి నష్టం నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టాల నుంచి రక్షణను ఇది అందిస్తుంది. చట్టపరమైన ఖర్చులు, వైద్య బిల్లులు, నష్టాలకు పరిహారం కోసం కవరేజీని అనందిస్తుంది.

డ్యామేజ్‌ టు ప్రాపర్టీ

మన ఆస్తికి ఎదైనా నష్టం జరిగినప్పుడు కవరేజ్‌ ఇస్తుంది.

పర్సనల్‌ యాక్సిడెంట్‌

ప్రమాదాల కారణంగా వధువు లేదా వరుడు ఆస్పత్రిలో చేరితో, వాటిని కూడా ఇది కవర్‌ చేస్తుంది.

అగ్ని ప్రమాదం లేదా దొంగతనం వల్ల జరిగే నష్టానికి కూడా ఇన్సూరెన్స్‌ కవరేజీ అందిస్తుంది. ముఖ్యంగా వివాహ సమయాల్లో క్యాటరింగ్‌, వివాహ వేదిక, ట్రావెల్‌ ఏజెన్సీలకు, హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌, మ్యూజిక్‌ అండ్‌ డెకరేషన్‌ కోసం ఇచ్చిన అడ్వాన్సులు, పెళ్లి పత్రికలకు అయిన ఖర్చు, వెడ్డింగ్‌ సెట్‌ కోసం చేసిన డెకరేషన్‌ ఖర్చులు అన్నీ ఈ వెడ్డింగ్‌ ఇన్సూరెన్స్‌తో రికవరీ చేసుకోవచ్చు.

Next Story