డెబిట్‌ కార్డుల్లో ఈ రకాలు ఉంటాయని తెలుసా?

ఆన్‌లైన్‌ లావాదేవీలకు డెబిట్‌ కార్డులు తొలి గేట్‌వే లాంటివి. వీటి ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ డెబిట్‌ కార్డుల్లో కూడా అనేక రకాలు ఉంటాయని చాలా మందికి తెలీదు.

By అంజి  Published on  8 July 2024 1:45 PM GMT
debit cards, Online transaction, Banking, Contactless debit card

డెబిట్‌ కార్డుల్లో ఈ రకాలు ఉంటాయని తెలుసా?

ఆన్‌లైన్‌ లావాదేవీలకు డెబిట్‌ కార్డులు తొలి గేట్‌వే లాంటివి. వీటి ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ డెబిట్‌ కార్డుల్లో కూడా అనేక రకాలు ఉంటాయని చాలా మందికి తెలీదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

- రెగ్యులర్‌ డెబిట్‌ కార్డు.. చాలా మంది దగ్గర ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు తమ ఖతాదారులకు ఇవే డెబిట్‌ కార్డులను అందిస్తాయి. ఈ కార్డుతో చెల్లింపులు చేసేటప్పుడు పిన్‌ నంబర్‌ తప్పనిసరిగా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ కార్డ్‌ పోయినా.. రిస్క్‌ కాస్త తక్కవుగా ఉంటుంది.

- కాంటాక్ట్‌ లెస్‌ కార్డు.. ల ద్వారా పీఓఎస్‌ మెషీన్‌ను తాకకుండానే లావాదేవీలు జరపొచ్చు. ఈ కార్డులో నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ అనే సాంకేతికను పొందుపరిచారు. దీని ద్వారా పిన్‌ లేకుండానే రూ.5 వేల వరకు లావాదేవీలు జరపొచ్చు.

- కో బ్రాండెడ్‌ డెబిట్‌ కార్డ్‌లపై.. ప్రత్యేక క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్‌లు పొందవచ్చు. అయితే ఈ డెబిట్‌ కార్డులపై యూజర్‌ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి.

- నాన్‌ కో బ్రాండెడ్‌ డెబిట్‌ కార్డులపై.. యూజర్‌ ఛార్జీలు సాధారణంగానే ఉంటాయి. అంతే కాకుండా ప్రత్యేక క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్లు కూడా కాస్తా తక్కువగానే ఉంటాయి.

- ప్రీమియం డెబిట్‌ కార్డుల.. ద్వారా రెట్టింపు ప్రయోజనం పొందవచ్చు. మిగతా డెబిట్‌ కార్డులతో పోలిస్తే ఇందులో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రీమియం కార్డులైతే డిస్కౌంట్లు, అధిక రివార్డు పాయింట్లతో పాటు విమానాశ్రయాలలో వీఐపీ లాంజ్‌ యాక్సెస్‌ లాంటివి కూడా అందిస్తాయి.

Next Story