సిబిల్ స్కోర్ గురించి మీకు ఇవి తెలుసా?
సిబిల్ స్కోర్‌ను చెక్ చేసే అధికారం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు మాత్రమే ఉంటుంది. పదే పదే చెక్ చేయడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుందనేది అవాస్తవం.
By అంజి Published on 27 Jan 2025 9:11 AM ISTసిబిల్ స్కోర్ గురించి మీకు ఇవి తెలుసా?
సిబిల్ స్కోర్‌ను చెక్ చేసే అధికారం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు మాత్రమే ఉంటుంది. పదే పదే చెక్ చేయడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుందనేది అవాస్తవం. ఆలస్యమైనా సరే బాకీలను చెల్లిస్తే సిబిల్ స్కోర్ రికార్డుల నుంచి తొలగిస్తారనేది అపోహ మాత్రమే. క్రెడిట్ హిస్టరీ ఎప్పటికీ మారదు. సమయానికి చెల్లింపులు చేస్తే క్రెడిట్ హిస్టరీ మెరుగు అయ్యే ఛాన్స్ ఉంది. కొత్త లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గదు.
మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్నవారితో పూచీకత్తు ఇప్పిస్తే మీ లోన్‌పై వడ్డీ రేటు తగ్గుతుంది. మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్నంత మాత్రాన బ్యాంకులు మీకు లోన్ అప్రూవ్ చేస్తాయనుకోవద్దు. నెల జీతం, అప్పటికే ఉన్న లోన్లు, క్రెడిట్ కార్డు వాడకం తీరునూ పరిశీలిస్తాయని గమనించాలి. బ్యాంకు అకౌంట్‌లో ఎంత డబ్బు ఉన్నా ట్రాన్సాక్షన్లు నిర్వహించకపోతే అది సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపదు.
సిబిల్ స్కోర్ పెరగాలంటే?
క్రెడిట్ కార్డ్ బిల్స్.. గడువు తేదీకి ముందే చెల్లించాలి. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉన్న కార్డుల్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. మల్టిపుల్ క్రెడిట్ కార్డులు తీసుకునే ప్రయత్నం మానుకోండి. మల్టిపుల్ క్రెడిట్ కార్డులు ఉంటే.. అన్ని కార్డుల్ని వినియోగించాలి. క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30 శాతం కన్నా ఎక్కువగా ఉపయోగించకపోవడం మేలు. ఉమ్మడిగా రుణాలు తీసుకోకండి. ఇతరులకు గ్యారంటీగా కూడా ఉండకండి. వారి వల్ల మీ సిబిల్ స్కోర్ ప్రభావితం అవుతుంది. క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.