పసిడి ప్రియులకు షాక్.. పరుగులు పెడుతున్న బంగారం ధర
December 9th Gold Price.పసిడి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు రోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 9 Dec 2021 2:12 AM GMTపసిడి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధర నేడు స్వల్పంగా పెరిగింది. శుక్రవారం దేశీయంగా రూ.20 నుంచి రూ.200 మేర పెరిగింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో డిమాండ్, పరిస్థితుల ఆధారంగా ధరల పెరుగుదల్లో మార్పులు ఉంటాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,390
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,220, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,330
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550
- హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల ధర రూ.49,040
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.