మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
December 5th Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 5 Dec 2021 2:08 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. నిన్న మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఎనిమిది రోజుల తరువాత ధర పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.300 నుంచి రూ.500 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా పసిడి ధర పెరుగుదల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,630, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,860
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల ధర రూ.48,820
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.