ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌

December 4th Gold Price.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యంతో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు నెల‌కొన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2021 2:07 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యంతో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో బంగారం ధ‌ర ఇటీవ‌ల త‌గ్గుతూ వ‌స్తుంది. నేడు కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.150 నుంచి రూ.190 మేర త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా పసిడి ధ‌ర త‌గ్గుద‌ల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,310 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.48,310గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌రలు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,730, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.45,620, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,870

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల ధర రూ.48,490

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story