ఒమిక్రాన్ భయం.. బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
December 3rd Gold Price.ప్రపంచానికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం పట్టుకుంది. దీంతో పలు దేశాలు
By తోట వంశీ కుమార్ Published on 3 Dec 2021 3:02 AM GMTప్రపంచానికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం పట్టుకుంది. దీంతో పలు దేశాలు ఇప్పటికే లాక్‌డౌన్‌లు, ఆంక్షలు విధిస్తున్నాయి. దీని ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతోంది. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర నేడు స్థిరంగా ఉంది. బంగారానికి డిమాండ్ తగ్గడం, ప్రజలు పొదుపు మంత్రం పాటించడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం దేశీయంగా చాలా చోట్ల స్థిరంగా ఉన్న పసిడి ధర కొన్ని చోట్ల మాత్రం స్వల్పంగా తగ్గింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,670, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,730
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,820, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,070
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల ధర రూ.48,650
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.