మ‌గువ‌ల‌కు శుభవార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

December 31st Gold Rate.కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ మ‌న దేశంలో ప‌సిడికి ఉన్న డిమాండ్ మ‌రే దేశంలోనూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2021 7:35 AM IST
మ‌గువ‌ల‌కు శుభవార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ మ‌న దేశంలో ప‌సిడికి ఉన్న డిమాండ్ మ‌రే దేశంలోనూ ఉండ‌దు. ఇక ప‌సిడి ధ‌రల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. దీంతో ప‌సిడి కొనుగోలుదారులు బంగారం ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు. ఇక శుక్ర‌వారం ప‌సిడి ధ‌ర భారీగా త‌గ్గింది. 10 గ్రాముల ప‌సిడిపై రూ.270 మేర త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో డిమాండ్, ప‌రిస్థితుల ఆధారంగా ధ‌రల త‌గ్గుద‌ల్లో తేడాలు ఉంటాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,320

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,760, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,020, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,120

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,570

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..48,990

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల ధర రూ..48,990

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story