మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

December 2nd Gold Price.మ‌గువ‌ల‌కు నిజంగా ఇది శుభ‌వార్త‌. వ‌రుస‌గా నాలుగో రోజు కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Dec 2021 2:08 AM GMT
మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

మ‌గువ‌ల‌కు నిజంగా ఇది శుభ‌వార్త‌. వ‌రుస‌గా నాలుగో రోజు కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. క‌రోనా సెకండ్ వేవ్ అనంత‌రం పెరుగుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌ర‌ల‌కు ఇటీవ‌ల కాస్త బ్రేక్ ప‌డింది. క్ర‌మంగా బంగారం ధ‌ర‌లు దిగివ‌స్తున్నాయి. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.200 నుంచి రూ.280 మేర త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితులు, త‌యారీ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ త‌గ్గుద‌ల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,210

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,880, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,960

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,300

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల ధర రూ.48,650

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story