మగువలకు షాక్.. పెరిగిన బంగారం ధర
December 24th Gold Rate. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు
By తోట వంశీ కుమార్ Published on 24 Dec 2021 7:54 AM ISTమన భారత దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే.. పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతూ ఉంటుంది. దీంతో పసిడి కొనుగోలుదారులు బంగారం ధర పై దృష్టి పెడుతుంటారు. ఇక గత రెండు రోజులుగా తగ్గిన ధర నేడు పెరిగింది. 10 గ్రాముల పసిడి ధరపై రూ.200 నుంచి రూ.330 మేర పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480
-పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,080
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,460
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350, 24 క్యారెట్ల ధర రూ.49,460
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.