ఈ రోజు బంగారం ధ‌ర త‌గ్గిందా..? పెరిగిందా..?

December 20th Gold Price.మ‌న దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మ‌రే దేశంలో ఉండ‌దు. బంగారం ధ‌ర‌ల్లో నిత్యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2021 7:30 AM IST
ఈ రోజు బంగారం ధ‌ర త‌గ్గిందా..? పెరిగిందా..?

మ‌న దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మ‌రే దేశంలో ఉండ‌దు. బంగారం ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధ‌ర త‌గ్గితే.. మ‌రో రోజు పెరుగుతూ ఉంటుంది. ఇక దేశంలో ప‌సిడి ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికీ కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గ‌వు. కాగా.. సోమ‌వారం కొన్ని ప్రాంతాల్లో ప‌సిడి ధ‌ర‌లు త‌గ్గగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప‌సిడి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,680

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,120

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850

-పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,800

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల ధర రూ.49,850

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story