షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

December 17th Gold Price.దేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగ‌లు వంటి సంద‌ర్భాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2021 2:09 AM GMT
షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

దేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగ‌లు వంటి సంద‌ర్భాల్లో బంగారాన్ని కొనుగోలు చేసేందుకే ఎక్కువ‌గా మ‌క్కువ చూపుతుంటారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో బంగారానికి మించి మ‌రేది ఆదుకోదు అనే బావ‌న చాలా మందిలో ఉండడ‌మే ఇందుకు కార‌ణం. నిన్న త‌గ్గిన పసిడి ధ‌ర నేడు భారీగా పెరిగింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై ఏకంగా రూ.300 మేర పెరిగింది. దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, ప‌రిస్థితుల ఆధారంగా ప‌సిడి ధ‌ర పెరుగుద‌ల్లో తేడాలుంటాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,420

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,770

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300, 24 క్యారెట్ల ధర రూ.49,420

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story