మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
December 15th Gold Price.మార్కెట్ లో డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా
By తోట వంశీ కుమార్ Published on 15 Dec 2021 2:04 AM GMTమార్కెట్ లో డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంది. దీంతో పసిడి కొనుగోలు చేయాలనుకునేవారు వాటి ధరలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. ఇక ఈరోజు కూడా పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం 10 గ్రాముల పసిడి ధరలపై రూ.130 నుంచి రూ.370 వరకు పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, పరిస్థితుల ఆధారంగా పసిడి ధర పెరుగుదల్లో తేడాలు ఉంటాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల ధర రూ.49,360
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.