పెరిగిన బంగారం ధర.. గ్రాముకు రూపాయి
December 13th Gold Price.భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. తమ ఆర్థిక అవసరాల్లో బంగారానికి
By తోట వంశీ కుమార్ Published on 13 Dec 2021 1:56 AM GMTభారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. తమ ఆర్థిక అవసరాల్లో బంగారానికి మించి మరేది అక్కరకు రాదు అనేది చాలా మంది బావించడమే ఇందుకు కారణం. పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. అందుకనే బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునేవారు ప్రత్యేకంగా వాటి ధరలపై దృష్టి సారిస్తుంటారు. ఇక గత కొద్ది రోజులుగా పసిడి ధర పెరుగుతూనే ఉంది. నేడు కూడా బంగారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,260 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,560 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,560
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,510
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110, 24 క్యారెట్ల ధర రూ.49,210
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.