తెలుగు రాష్ట్రాల్లో ప‌సిడి ధ‌ర‌లు పెరిగాయా..? త‌గ్గాయా..?

December 10th Gold Rate.ప‌సిడి ధ‌రల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2021 2:01 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ప‌సిడి ధ‌ర‌లు పెరిగాయా..? త‌గ్గాయా..?

ప‌సిడి ధ‌రల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ రోజు ధ‌ర త‌గ్గితే.. మ‌రో రోజు పెరుగుతూ ఉంటుంది. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో గ‌త కొద్ది రోజులుగా ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. నిన్న పెరిగిన ప‌సిడి ధ‌ర నేడు స్థిరంగా ఉంది. దేశీయంగా ఒక‌టి రెండు చోట్ల మాత్ర‌మే పెరుగ‌గా.. మిగిలిన ప్ర‌ధాన న‌గ‌రాల్లో స్థిరంగా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,390

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,550

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల ధర రూ.49,040

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story