క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే మాత్రం..
మీరు ఎన్ని క్రెడిట్ కార్డులు వాడినా ఫర్వాలేదు. కానీ, వాటిని నిర్వహించేటప్పుడు చేయకూడని కొన్ని తప్పులు ఉంటాయి.
By అంజి Published on 22 May 2024 9:30 AM GMTక్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే మాత్రం..
మీరు ఎన్ని క్రెడిట్ కార్డులు వాడినా ఫర్వాలేదు. కానీ, వాటిని నిర్వహించేటప్పుడు చేయకూడని కొన్ని తప్పులు ఉంటాయి. వాటిని చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
క్రెడిట్ కార్డుల మీద లిమిట్ ఉంది కదా అని పూర్తిగా లేదా 80 శాతానికి మించి వాడకూడదు. ఇలా చేయడంతో క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ద్వారా మీ క్రెడిట్ స్కోర్ మీద దీని ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డు మొత్తం పరిమితిలో నుంచి కచ్చితంగా 30 శాతం మాత్రమే వినియోగించాలి.
అలాగే ఏటీఎమ్‌ల ద్వారా కొంత మంది నగదు విత్‌డ్రా చేస్తుంటారు. దీని వల్ల భారీగా ఛార్జీలు పడుతాయి. 2 - 4 శాతం వరకు వడ్డీ.. క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ కింద మరో 2 - 3 శాతం అదనంగా జీఎస్టీ ఉంటుంది.
బిల్ జనరేట్ అవ్వగానే మీకు రెండు పేమెంట్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మినిమమ్ బిల్ అమౌంట్, టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అని. కచ్చితంగా బకాయి ఉన్న మొత్తం చెల్లించాలి.
వ్యక్తిగతంగా, ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా క్రెడిట్ కార్డ్ వివరాలు తెలియజేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సీవీవీ, ఓటీపీ, వంటి వివరాలను తెలియజేయకూడదు.
స్వైప్ కోసం మీరు క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు, మీ కార్డును వారు ఎలా ఉపయోగిస్తున్నారో పరిశీలిస్తూ ఉండాలి. అనధికార లావాదేవీలకు వాడకుండా వారిని నిరోధించాలి. పాస్ వర్డ్ లేదా పిన్ ను వారికి చెప్పకుండా, మీరే ఎంటర్ చేయాలి.