ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనల్లో పలు మార్పులు చేశాయి. ఈ జాబితాలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, సిటీ బ్యాంకులు ఉన్నాయి. ఆ మార్పులు ఏంటో ఒకసారి చూద్దాం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ నుంచి లావాదేవీలపై ఈ బ్యాంకు ఇక నుంచి ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమలు అవుతాయి.
ఎస్‌బీఐ: క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లకు సంబంధించి ఈ బ్యాంకు కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్ల సేకరణ నిలిపివేసింది. ఈ రూల్ జులై 1వ ఏదీనే అమలవగా మరికొన్ని నిబంధనలు జులై 15 నుంచి ప్రారంభం అవుతాయి.
సిటీ బ్యాంకు: ఈ బ్యాంక్‌కు సంబంధించి క్రెడిట్ కార్డు ఖాతాలు జులై 15 వరకు యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం అవుతాయి. కొత్త యాక్సిస్ కార్డులు వచ్చే వరకు సిటీ బ్రాండ్ కార్డులు పని చేస్తాయి. కొత్త కార్డులు వచ్చినప్పటికీ రివార్డు పాయింట్లు ఎక్స్‌పైర్ కావని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
ఐసీఐసీఐ బ్యాంక్: ఈ బ్యాంక్‌కు సంబంధించి క్రెడిట్ కార్డు మార్చుకోవాలంటే ఇకపై రూ.200 చెల్లించాలి. గతంలో ఈ ధర రూ.100గా ఉండేది. స్లిప్ రిక్వెస్ట్, డయల్ ఏ డ్రాప్ లావాదేవీ ఛార్జీ, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు వంటి వాటిపై ఛార్జీలను తొలగించనుంది.