కరోనా కష్టం నుంచి కోలుకోనేలేదు. ఓ వైపు ఇంధన ధరలు భయపెట్టిస్తుండగా.. గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. దసరా పండుగకు ముందే వంట గదిలో మంటపెట్టేశారు. గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రాయితీ, రాయితీయేతర ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.15 పెంచేశాయి. పెంచిన ధర నేటి నుంచే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.899.50కి చేరింది.
కోల్‌కతాలో రూ .911 నుండి రూ .926 కి, ముంబైలో రూ .844.50 నుండి రూ .899.50 కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో రూ.952కి చేరింది. రెండు నెలల్లో వంటగ్యాస్ ధరను నాలుగు సార్లు పెంచారు. ఈ ఏడాది మొత్తంగా ఇప్పటి వరకు వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 205 పెరిగింది. ఇక ఎల్‌పీజీ సిలిండర్ ధరను తనిఖీ చేయడానికి.. మీరు ప్రభుత్వ చమురు కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ కంపెనీలు ప్రతి నెలా కొత్త రేట్లు జారీ చేస్తాయి. మీరు https://iocl.com/Products/IndaneGas.aspx లింక్‌లో మీ నగరం గ్యాస్ సిలిండర్ల ధరను తనిఖీ చేసుకోవచ్చు