క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఫిబ్ర‌వ‌రి నెల‌లో బ్యాంకు సెల‌వులు ఇవే

Complete list of bank holidays in February 2023.ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఏ ఏ రోజుల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2023 8:14 AM IST
క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఫిబ్ర‌వ‌రి నెల‌లో బ్యాంకు సెల‌వులు ఇవే

ఇటీవ‌ల కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ అందుబాటులోకి వ‌చ్చినప్ప‌టికీ ఖ‌చ్చితంగా బ్యాంకు బ్రాంచికి వెళ్లి పూర్తి చేయాల్సిన ప‌నులు ఉంటూనే ఉన్నాయి. ఏదో ఒక‌ పని కోసం బ్యాంక్‌కు వెళ్లినప్పుడు, సెలవు అని తెలిస్తే నిరుత్సాహం త‌ప్ప‌దు. పైగా స‌మ‌యం కూడా వృధా అవుతుంది. అందుక‌నే ఏ నెల‌లోనైనా బ్యాంకు సెల‌వుల‌ను ముందే గుర్తించ‌డం ద్వారా ఆ ప‌ని బ్యాంకు సెల‌వు రోజు ముందో త‌రువాత రోజే షెడ్యూల్ చేసుకుని ప‌ని పూర్తి చేసుకోవ‌చ్చు. మ‌రో వారం రోజుల్లో జ‌న‌వ‌రి నెల ముగిసి ఫిబ్ర‌వ‌రి నెల ప్రారంభం కానుంది. మ‌రి ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఏ ఏ రోజుల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయో తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్ర‌కారం 2023 ఫిబ్రవరి నెల‌లో వివిధ రాష్ట్రాల్లో మొత్తం 10 రోజుల పాటు బ్యాంకులను మూసివేస్తారు. సాధార‌ణంగా వ‌చ్చే ఆదివారాలు, రెండో, నాలుగో శ‌నివారం కాకుండా మ‌హాశివ‌రాత్రి వంటి ప‌ర్వ‌దినాలు కూడా ఉన్నాయి.

ఫిబ్ర‌వ‌రి నెల‌లో సెల‌వులు ఇవే

2023 ఫిబ్రవరి 5 - ఆదివారం

2023 ఫిబ్రవరి 11- రెండో శనివారం

2023 ఫిబ్రవరి 12 - ఆదివారం

2023 ఫిబ్రవరి 15 - Lui-Ngai-Ni పండుగ (హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు)

2023 ఫిబ్రవరి 18 - మహాశివరాత్రి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, హైదరాబాద్, కాన్పూర్, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పుర్, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు)

2023 ఫిబ్రవరి 19 - ఆదివారం

2023 ఫిబ్రవరి 20 - మిజోరం రాష్ట్ర దినోత్సవం (ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు)

2023 ఫిబ్రవరి 21 - లోసార్ పండుగ (గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు)

2023 ఫిబ్రవరి 25 - మూడో శనివారం

2023 ఫిబ్రవరి 26 - ఆదివారం

Next Story