వినియోగదారులకు శుభ‌వార్త‌.. వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర త‌గ్గింపు

Commercial LPG cylinder prices slashed by Rs 91.50.ప్ర‌తి నెల గ్యాస్ ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయ‌న్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2022 8:17 AM GMT
వినియోగదారులకు శుభ‌వార్త‌.. వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర త‌గ్గింపు

ప్ర‌తి నెల గ్యాస్ ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో వినియోగ‌దారుల‌కు చ‌మురు కంపెనీలు శుభ‌వార్త చెప్పాయి. గ‌త కొంత కాలంగా పెరుగుతూ వ‌స్తున్న వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను త‌గ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.91.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. 14.2 కేజీల సిలిండ‌ర్ ధ‌ర‌ల్లో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు. స‌వ‌రించిన ధ‌ర‌లు నేటి( ఫిబ్రవరి 1) నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి.

తగ్గిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1907 ఉండగా, కోల్‌కతాలో రూ.1987, ముంబైలో రూ. 1857,హైదరాబాద్‌లో రూ.1813.82, చెన్నైలో రూ.2080.5 ఉంది. ఇక స‌బ్సీడీ లేని డొమెస్టిక్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో 14.2 కిలోల సిలిండ‌ర్ ఢిల్లీ, ముంబైల‌లో రూ.899.5, కోల్‌క‌తాలో రూ.926, చెన్నైలో 915.5, హైద‌రాబాద్‌లో రూ.960గా కొన‌సాగుతోంది.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను చూడ‌డానికి చమురు సంస్థల అధికారిక వెబ్ సైట్ సందర్శించాల్సి ఉంటుంది. ప్రతి నెల మార్పులు జరిగే కొత్త ధరలను https://iocl.com/Products/IndaneGas.aspx పై క్లిక్ చేసి మీ నగరంలో ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలను తెలుసుకోవ‌చ్చు.

Next Story