ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిలిండర్ ధర
Commercial LPG cylinder prices cut by Rs 135.ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి చమురు కంపెనీలు. కమర్షియల్
By తోట వంశీ కుమార్ Published on
1 Jun 2022 3:25 AM GMT

ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి చమురు కంపెనీలు. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 135 మేర తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక తగ్గించిన ధరలు నేటి(బుధవారం) నుంచే అమలులోకి రానున్నాయి. తగ్గిన ధరతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,219కు తగ్గగా, కోల్‌కతాలో రూ.2,322, ముంబైలో 2,171.50, చెన్నైలో రూ.2,373, హైదరాబాద్‌లోరూ.2,220.50కు చేరింది. కాగా.. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.102.50 పెరగగా.. తాజాగా దిగిరావడం ఊరటనిచ్చింది. అయితే.. గృహా అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.
Next Story