దసరాకు ముందు గుడ్‌న్యూస్‌.. తగ్గిన క‌మ‌ర్షియ‌ల్ ఎల్‌పీజీ సిలిండర్ ధ‌ర‌

Commercial LPG cylinder price slashed by Rs 25.5 in Delhi.ద‌స‌రాకు ముందు వినియోగ‌దారుల‌కు అదిరిపోయే శుభ‌వార్త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2022 5:35 AM GMT
దసరాకు ముందు గుడ్‌న్యూస్‌.. తగ్గిన క‌మ‌ర్షియ‌ల్ ఎల్‌పీజీ సిలిండర్ ధ‌ర‌

ద‌స‌రాకు ముందు వినియోగ‌దారుల‌కు అదిరిపోయే శుభ‌వార్త అందించాయి చ‌మురు కంపెనీలు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను త‌గ్గించాయి. అయితే.. ఈ ఉప‌శ‌మ‌నం కేవ‌లం వాణిజ్య సిలిండ‌ర్లను వినియోగించేవారికి మాత్ర‌మే. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.25.50 తగ్గించాయి. త‌గ్గించిన ధ‌ర త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నాయి.

తాజా త‌గ్గింపుతో 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్ ధ‌ర ఢిల్లీలో రూ.1859కి చేరింది. హైదరాబాద్‌లో రూ.36.50 తగ్గడంతో రూ.2099.5గా ఉన్న సిలిండర్‌ ధ‌ర రూ.2064కు పడిపోయింది. అదే విధంగా కోల్‌కతాలో రూ.1959, ముంబైలో 1811.5, చెన్నైలో రూ.2009.5కి చేరింది. ఈ సంవ‌త్సం గ‌రిష్ట‌స్థాయికి చేరిన క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర జూలై నెల నుంచి త‌గ్గుతూ వ‌స్తోంది. జూలై లో రూ.135, ఆగస్టులో రూ.36, సెప్టెంబర్‌ 1న రూ.91.50 మేర తగ్గింది. తాజాగా మ‌రో రూ.25.5 త‌గ్గింది.

ఇదిలాఉంటే.. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం గ‌మ‌నార్హం. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరగా జూలై 6న మాత్రమే రూ.50 పెరిగింది. ఆ తర్వాత మళ్లీ పెరగలేదు. తగ్గలేదు.హైదరాబాద్‌లో 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1105, వరంగల్‌లో రూ.1124, విజయవాడలో రూ.1076.50, విశాఖపట్టణంలో రూ.1068.5 గా ఉంది.

Next Story