4000 మందికి షాక్ ఇచ్చిన సిస్కో

నెట్‌వర్కింగ్ పరికరాలలో అతిపెద్ద తయారీదారు సిస్కో సిస్టమ్స్ ఉద్యోగులకు షాకిచ్చింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Feb 2024 2:30 PM GMT
cisco systems, shock,  employees,

4000 మందికి షాక్ ఇచ్చిన సిస్కో

నెట్‌వర్కింగ్ పరికరాలలో అతిపెద్ద తయారీదారు సిస్కో సిస్టమ్స్ ఉద్యోగులకు షాకిచ్చింది. కార్పొరేట్ టెక్ ఖర్చులలో మందగమనం.. అమ్మకాలు పెద్దగా లేకపోవడంతో వేలాది ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం సిస్కో శ్రామికశక్తిలో దాదాపు 5% మందిని ప్రభావితం చేస్తుందని కంపెనీ బుధవారం తెలిపింది. ఈ సంస్థలో దాదాపు 85,000 మంది ఉద్యోగులు పని చేస్తూ ఉన్నారు. ఈ సరికొత్త చర్యల కారణంగా దాదాపు 4,000 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇక సిస్కో షేర్లు ఇటీవల భారీగా పతనమయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 85,000 కంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రాయిటర్స్ ప్రకారం ఈ కంపెనీ తన ఉద్యోగులలో 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. పింక్ స్లిప్పులు ఇచ్చి 4 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నారు. సిస్కో ప్రస్తుతం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. ఈ క్రమంలోనే ఖర్చును తగ్గించుకోవడం, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిస్కో తన వార్షిక ఆదాయ లక్ష్య అంచనాను $52.5 బిలియన్ల నుంచి $51.5 బిలియన్లకు తగ్గించింది.

Next Story