అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అయితే త్వరలో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక ఏడాదిలో పైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు రాబోతున్నాయి.
By అంజి
అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అయితే త్వరలో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక ఏడాదిలో పైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్
ఏప్రిల్ 1 నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలుపుకుని కూడా పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే రూ.25 వేలుగా ఉన్న రిబేట్‌ను రూ.60 వేలకు పెంచారు.
క్రెడిట్ కార్డు నిబంధనలు
రివార్డులపై ఎస్‌బీఐ కార్డ్స్ కోత పెట్టింది. ఎయిరిండియా టికెట్, స్విగ్గీ ఆర్డర్‌లపై లభించే రివార్డులను తగ్గించింది. ఎయిరిండియా ఎస్‌బీఐ సిగ్నేచర్, ఎయిరిండియా ఎస్‌బీఐ ప్లాటినమ్, ఎస్‌బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు.. ఏప్రిల్ 1 నుంచి ప్రయోజనాల్లో కోత పడుతుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తారా క్రెడిట్ కార్డు రివార్డును వచ్చే నెల నుంచి సవరించనుంది. ఈ కార్డు వాడే వారికి కొన్ని ప్రయోజనాల్లో కోత పడనుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా ఏప్రిల్‌లో రెన్యువల్ అయ్యే విస్తారా కార్డులకు వార్షిక ఛార్జీ తొలగించింది.
ఆ నంబర్లకు యూపీఐ సేవలు నిలిపివేత
ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. దీనికి సంబంధించి బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లకు ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. యూపీఐ లైట్ వ్యాలెట్‌లో ఉన్న మొత్తాలను మళ్లీ బ్యాంక్ అకౌంట్‌కు పంపించే ఫెసిలిటీ ఏప్రిల్ నుంచి అందుబాటులకి రానుంది.
వాత్సల్య పథకంకు పన్ను మినహాయింపు
పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వారి కోసం తీసుకొచ్చిన ఎ్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ కింద కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి పన్ను మినహాయింపు పొందవచ్చ. సెక్షన్ 80సీసీడీ (1బి) కింద పన్ను ప్రయోజనాలను కల్పించారు. అయితే ఇది పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది.
టీడీఎస్ మార్పులు..
ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమ అయ్యే వార్షిక వడ్డీ రూ.50 వేలు దాటితే.. దానిపై టీడీఎస్ వసూలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచారు. అటు 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని రూ.40 వేల నుంచి రూ.50 వేల కు పెంచారు.