పెరగనున్న సిమెంట్ ధర
దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెండ్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ సంస్థ సీఆర్‌ఐఎస్‌ఐఎల్ అంచనా వేసింది.
By అంజి
పెరగనున్న సిమెంట్ ధర
దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెండ్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ సంస్థ సీఆర్‌ఐఎస్‌ఐఎల్ అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే అంచనాలతో గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం ఊపందుకుంటుందని తెలిపింది. అలాగే మౌలిక సదుపాయాల వ్యయం పెరగడంతో సిమెంట్ డిమాండ్ అధికం అవుతుందని వెల్లడించింది. మొత్తం డిమాండ్‌లో 12 రాష్ట్రాల వాటా 63 - 65 శాతం ఉండొచ్చని వివరించింది. దీని వల్ల సిమెంట్ ధరలు 2 నుంచి 4 శాతం పెరగొచ్చని పేర్కొంది.
"ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ రంగం 6.5-7.5 శాతం డిమాండ్ వృద్ధిని సాధిస్తుందని అంచనా వేయబడింది, దీనికి ప్రధాన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు 10 శాతం పెరగడం, సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాలు వ్యవసాయ లాభదాయకతను పెంచుతాయని, తద్వారా గ్రామీణ గృహ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేయబడింది " అని సీఆర్‌ఐఎస్‌ఐఎల్ తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ మంత్రిత్వ శాఖలకు పెరిగిన మూలధన కేటాయింపుల కారణంగా అన్ని విభాగాలలో డిమాండ్ పెరుగుదల అంచనా వేయబడింది.
రెండేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తర్వాత, ఈ పెరుగుదల 2026 ఆర్థిక సంవత్సరంలో ధరల పెరుగుదలకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం సిమెంట్ పరిశ్రమకు పెద్దగా కలిసి రాలేదు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గిరాకీ 4.5 నుంచి 5.5 శాతం మాత్రమే పెరిగింది. లోక్‌సభ ఎన్నికలు, భారీ వర్షాలు ఇందుకు ప్రధాన కారణం. దీంతో గత ఆర్థిక సంవత్సరం ధరలు కూడా పరిశ్రమను బాగా నిరాశ పరిచాయి.