Budget 2026: లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకుని.. సుస్థిరాభివృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా 2026 - 2027 ఫైనాన్షియల్‌ ఇయర్‌కు సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు...

By -  అంజి
Published on : 1 Feb 2026 11:30 AM IST

Budget 2026, Finance Minister Nirmala Sitharaman , Budget, Parliament

Budget 2026: లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకుని.. సుస్థిరాభివృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా 2026 - 2027 ఫైనాన్షియల్‌ ఇయర్‌కు సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా ఈ బడ్జెట్‌ను లోక్‌సభలో ఉంచారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆదివారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే ఫస్ట్‌టైమ్‌.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. 'పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. కర్తవ్య భవన్‌లో రూపొందించిన మూడో బడ్జెట్‌ ఇది. యువశక్తి కేంద్రం ఈ బడ్జెట్‌ ఉండబోతోంది. భారత్‌ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోంది. ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను ఆచరణలోని తీసుకొస్తున్నాం'' అని పేర్కొన్నారు.

దేశంలో 7 శాతం వృద్ధి రేటును సాధించగలిగామని చెప్పారు. ప్రతి రంగం, వర్గానికి నిధులు, సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

అంతకుముందు కేంద్ర కేబినెట్‌ 2026 - 27 వార్షిక పద్దుకు ఆమోదం తెలిపింది. ముందుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌కు అనుమతి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమె పార్లమెంట్‌కు చేరుకొని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.

Next Story