వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన : నిర్మలా సీతారామన్
Budget 2022 to lay foundation for the next 25 years says FM Nirmala Sitharaman.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
By తోట వంశీ కుమార్ Published on 1 Feb 2022 11:38 AM ISTకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సారి కూడా పేపర్ లెస్ బడ్జెట్‌నే ఆమె సమర్పించారు. వరుసగా నాలుగో సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా మూడో వేవ్ ఉద్దృతి, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు బడ్జెట్‌పై భారీ ఆశలనే పెట్టుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన అనంతరం నిర్మలా బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సమర్పించారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు.
మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. వచ్చే 25 ఏళ్ల కాలానికి ఈ బడ్జెట్ పునాది అని అభివర్ణించారు. స్వయం సమృద్ధి సాధించడంపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టిందన్నారు. ద్రవ్య స్థితిపై పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నారు. గృహ నిర్మాణంపై దృష్టి సారించామని.. తాము చేపడుతున్న చర్యలకు చెప్పుకోదగ్గ ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇక ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఆత్మ నిర్భర్ మిషన్ క్రింద 60 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. మూల ధన వ్యయం పెరిగిందన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం రాబోతోందన్నారు. త్వరలోనే ఎల్ఐసీ ఐపీవోను తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇక రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పీఎం గతిశక్తి పథకంలో సంతులిత అభివృద్ది సాధించామన్నారు.ఇక కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా ఉపయోగపడిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు.