దక్షిణాదిలో మార్కెట్ ను పెంచుకునేందుకు BOULT కీలక ఒప్పందం
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వేరబుల్ బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకువచ్చేది BOULT. ఇప్పటికే ఎన్నో వినూత్నమైన ఉత్పత్తులను
By Medi Samrat Published on 23 Feb 2024 10:00 AM GMTభారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వేరబుల్ బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకువచ్చేది BOULT. ఇప్పటికే ఎన్నో వినూత్నమైన ఉత్పత్తులను లాంచ్ చేసి దేశ యువతను మెప్పించింది BOULT. అయితే దక్షిణాదిలో కూడా తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా మార్కెట్‌లకు పంపిణీదారు అయినటువంటి డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిద్వారా వ్యూహాత్మక రిటైల్ విస్తరణ ప్రణాళికల్లో BOULT సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది. BOULT యొక్క మార్కెట్ ను మరింతగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు అయినటువంటి రహిల్ మరియు ఇక్బాల్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో BOULT కోసం ప్రత్యేక భాగస్వామిగా డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నియమించబడంది.
2023 కంటే ముుందు, BOULT భారతదేశంలో బలమైన రిటైల్ విస్తరణతో అద్భుతమైన అభివృద్ధిని నమోదు చేసింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 5000 స్టోర్‌లను (ప్రత్యేకమైన + ఫ్రాంచైజీలు) కలిగి ఉంది. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉనికిని కలిగి ఉంది. దీనికితోడు ఇప్పుడు సరికొత్తగా గ్లోబల్ ఆఫ్‌లైన్ రిటైల్ నెట్‌వర్క్‌లో భాగంగా నేపాల్ మార్కెట్ లోకి కూడా ప్రవేశించింది. తద్వారా వ్యూహాత్మక రిటైల్ విస్తరణ ప్రణాళికల్లో మరో అడుగు ముందుకు వేసింది.
ఈ సందర్భంగా BOULT సహ వ్యవస్థాపకుడు శ్రీ వరుణ్ గుప్తా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... "డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల్లోకి మా విస్తరణను మరింతగా పెంచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ భాగస్వామ్యం కుదిరినందుకు చాలా ఆనందంగా ఉంది. మా ఓమ్నీ-ఛానల్ ఉనికిని మెరుగుపరచడానికి మేము నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము. మేము గ్లోబల్ మార్కెట్‌లలో ఇప్పటికే ఉన్నాం. అయినప్పటికీ మా ఉనికికి భారతదేశం అంతటా విస్తరించాలనే మా ఆకాంక్షలను ఇది
సూచిస్తుంది. ఈ సహకారం ద్వారా దక్షిణ భారతదేశంలోని డైనమిక్ మార్కెట్‌కి మా అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులు అందించడంలో మా ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతుంది. డికాజో సొల్యూషన్స్ కు ఉన్న విస్తృతమైన నెట్ వర్క్ మరియు వారికున్న అంకితభావం మా ఉత్పత్తులను మరింతగా వినియోగదారులకు చేరువ అవుతుందని మేం భావిస్తున్నాం అని అన్నారు ఆయన.
“2024 కోసం మా లక్ష్యం ఏంటంటే... BOULT ఉత్పత్తులను మా అంతర్జాతీయ రిటైల్ విస్తరణ ప్రణాళికల ద్వారా దేశంలోని ప్రతి మూలకు చేరుకునేలా చేయడం. మా ఈ-కామర్స్ కొనుగోళ్లు ద్వారా 2023లో మేం గణనీయమైన ప్రోత్సాహాన్ని అందుకున్నాం. 2024 మొదటి త్రైమాసికానికి మేం భారతదేశంలో 15% మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పుడు డికాజోతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లగలమనే నమ్మకం మాకుంది ”అని అన్నారు బౌల్ట్ ఆఫ్‌లైన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ శ్రీ శంతను సింగ్.
ఈ సందర్భంగా BOULTతో భాగస్వామ్యం గురించి డికాజో బిజినెస్ డైరెక్టర్ శ్రీ మొహమ్మద్ ఇక్బాల్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త సాంకేతికతలను అర్థం చేసుకుని మార్కెట్ ఉనికిని మరింతగా విస్తరించుకోవాలనే మా ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంది. అందుకే మేం BOULTతో కలిసి పని చేయడానికి సంతోషిస్తున్నాము. BOULT యొక్క విభిన్నమైన ఉత్పత్తులు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోని ప్రతి మూలకు చేరుకునేలా చూసుకోవాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. BOULT యొక్క అసాధారణమైన ఉత్పత్తులను మా కస్టమర్‌లకు చేరువ చేసే విజయవంతమైన సహకారం కోసం మేము ఎదురుచూస్తున్నాము అని అన్నారు ఆయన.
2017లో ప్రారంభమైన BOULT ప్రయాణం ఈ-కామర్స్‌పై దృష్టి సారించి ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారుల యొక్క విభిన్న అవసరాలను తీర్చగలిగేలా అభివృద్ధి చెందింది. సానుకూల రిటైల్ విస్తరణ ద్వారా భారతదేశం వెలుపల కూడా అన్ని వర్గాల వినియోగదారులను అందుకోవాలనే BOULT యొక్క నిబద్ధతకు ఇది నిదర్శనం. కేవలం ఆరేళ్లలో, BOULT భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వేరబుల్ బ్రాండ్‌లలో ఒకటిగా ఎదిగింది. ఆన్ లైన్ లో బ్రాండ్ అన్ని వర్గాల వారికి చేరువ అయ్యింది. దానికి నిదర్శనమే.. అత్యుత్తమ అమ్మకాల గణాంకాలు నమోదు చేయడం. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో 2 మిలియన్ ప్లస్ 4+ స్టార్ రేటింగ్‌ల ద్వారా వర్గీకరించబడింది. BOULT ఆడియో పరిశ్రమలో మార్కెట్ వాటాలో #2 స్థానానికి చేరుకుంది. కేవలం 8 నెలలలోపు భారతీయ స్మార్ట్‌వాచ్‌ల విభాగంలో #4 ర్యాంకింగ్‌ను పొందింది.