ఇకపై కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే కాళ్లు అరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక మిస్డ్ కాల్‌తో ఇండేన్ నుంచి కొత్త కనెక్షన్ పొందవచ్చు. ఈ సరికొత్త సదుపాయాన్ని ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తీసుకొచ్చింది. ఇందుకోసం 84549 55555 నంబరును ప్రారంభించింది. ఈ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కొత్త కనెక్షన్‌ను బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఇండేన్ గ్యాస్ ప్రతినిధులు వచ్చి.. కనెక్షన్ ఇచ్చిపోతారు. ఐవోసీ చైర్మన్ ఎస్‌ఎం వైద్య సోమవారమే ఈ నంబర్‌ను ప్రారంభించారు. దేశంలో ఎక్కడైనా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఇప్పటికే కనెక్షన్ ఉన్నవారు సిలిండర్ రీఫిల్ చేసుకోవాలన్నా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఈ నంబర్‌కే మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. అందుబాటులోకి వచ్చిన కొత్త సేవల ద్వారా డబుల్ బాటిల్ కనెక్షన్ (డీబీసీ)ని కూడా పొందొచ్చు. ఒక సిలిండర్ కలిగిన వినియోగదారులు ఇంటి వద్దే డీబీసీకి మారొచ్చు. ఆసక్తి కలిగిన వినియోగదారులు 14.2 కేజీల సిలిండర్‌కు బదులు 5 కేజీల సిలిండర్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని అందిస్తున్న ఏకైక సంస్థ ఐవోసీ ఒక్కటే. అలాగే.. 75888 88814 నంబరుకు వాట్సాప్ ద్వారా కానీ, 77185 55555 నంబరుకు ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ విధానంలో కానీ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.