అత్యంత కాస్ట్‌లీ బైక్... ఏంతంటే..

BMW M 1000 RR sportsbike launched. బీఎండబ్ల్యూ మోటారాడ్ ఇండియా తన పోర్ట్ ఫోలియాలో చేర్చింది. సరికొత్త బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్ మోడల్ ను భారత్ లో ప్రవేశపెట్టింది.

By Medi Samrat  Published on  26 March 2021 4:25 AM GMT
BMW M 1000 RR sportsbike launched

ఒక బైక్ ఖరీదు ఎంత ఉంటుంది..అటూ, ఇటు అంతా కలిపి ఒక లక్ష.. అంతే కదా.. అలా కాకుండా మన ఊహలకి అందని రేంజ్ లో కూడా బైక్ లు ఉంటాయి.. అలాంటి మరో బైక్ ను జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూకి చెందిన బైక్ ల విభాగం బీఎండబ్ల్యూ మోటారాడ్ ఇండియా తన పోర్ట్ ఫోలియాలో చేర్చింది. సరికొత్త బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్ మోడల్ ను భారత్ లో ప్రవేశపెట్టింది. ఎం సిరీస్ లో భారత రోడ్లపై పరుగులు తీయనున్న మొట్టమొదటి సూపర్ బైక్ ఇది. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.42 లక్షలు.

గతంలో వచ్చిన బీఎండబ్ల్యూ S1000 R R మోడల్ ను అభివృద్ధి చేసి M సిరీస్ లో విడుదల చేశారు. దీంట్లో 999 సీసీ వాటర్/ఆయిల్ కూల్డ్ 4 సిలిండర్ ఇన్ లైన్ ఇంజిన్ పొందుపరిచారు. గరిష్ఠంగా 212 హెచ్ పీ కలిగివుంటే ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 306 కిలోమీటర్లు. ఈ బైక్ 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.1 సెకన్లలోనే అందుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీంట్లో సౌకర్యవంతమైన రైడింగ్ కోసం రోడ్, డైనమిక్, రేస్ మోడ్స్ ఏర్పాటు చేశారు.

Advertisement

అత్యాధునిక షిఫ్ట్ కామ్ టెక్నాలజీతో వస్తున్న ఈ బైక్ ప్రధానంగా రేసింగ్ బైక్ అని దీని డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది. బ్రేక్స్, కార్బన్ వీల్స్ ప్రత్యేకంగా రూపొందించారు. దీంట్లో మల్టిఫంక్షనల్ ఇన్ స్ట్రుమెంటల్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. బైక్ కు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ ప్యానెల్ పై కనిపిస్తుంది. కిలోమీటర్లతో సంబంధం లేకుండా మూడేళ్ల వారంటీ, ఐదేళ్ల వారంటీ పొడిగింపు సదుపాయాలు బైక్ కొనుగోలుదారులకు అందించనున్నారు. ఇంత కాస్టలీ బైక్ కి కూడా దేశవ్యాప్తంగా బీఎండబ్ల్యూ మోటారాడ్ డీలర్ల వద్ద బుకింగ్ లు ప్రారంభమయ్యాయి.


Next Story
Share it