ఎయిర్‌టెల్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. రీఛార్జ్‌ ధరలు భారీగా పెంపు

టెలికాం మేజర్ భారతీ ఎయిర్‌టెల్ జూలై 3 నుంచి మొబైల్ టారిఫ్‌లను భారీగా పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

By అంజి
Published on : 28 Jun 2024 11:06 AM IST

Bharti Airtel, mobile tariffs, Jio, Airtel Recharge

ఎయిర్‌టెల్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. రీఛార్జ్‌ ధరలు భారీగా పెంపు

న్యూఢిల్లీ: టెలికాం మేజర్ భారతీ ఎయిర్‌టెల్ జూలై 3 నుంచి మొబైల్ టారిఫ్‌లను భారీగా పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అపరిమిత వాయిస్ ప్లాన్‌లలో.. భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ మొబైల్ టారిఫ్‌లను రూ.179 నుంచి రూ.199కి, రూ.455 నుంచి రూ.599కి, రూ.1,799 నుంచి రూ.1,999 ప్లాన్‌కు పెంచింది. పోస్ట్-పెయిడ్ ప్లాన్‌ల కోసం, రూ. 399 టారిఫ్ ప్లాన్ ఇప్పుడు రూ. 449; రూ.499 ప్లాన్ రూ.549; రూ. 599 ప్లాన్ ధర రూ. 699, రూ. 999 ప్లాన్ ఇప్పుడు రూ. 1199కి వస్తుంది. ఈ పెంచిన టారిఫ్‌లు జూలై 3 నుండి అమలులో వస్తాయి.

భారతి ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో.. భారతదేశంలోని టెల్కోలకు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాను ప్రారంభించడానికి మొబైల్ సగటు ఆదాయం (ARPU) రూ. 300 కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. "ఈ స్థాయి ARPU నెట్‌వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రమ్‌లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులను ఎనేబుల్ చేస్తుందని, మూలధనంపై నిరాడంబరమైన రాబడిని అందిస్తుందని మేము నమ్ముతున్నాము" అని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 1 శాతం పెరిగి ఒక్కొక్కటి రూ.1,491 వద్ద ఉన్నాయి. నిన్న రిలయన్స్ జియో కూడా మొబైల్ టారిఫ్‌లను 12-27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

Next Story