మీకు బ్యాంకుల్లో ఏదైనా పని ఉందా..? అయితే.. ఓ రెండు రోజులు ఆగక తప్పదు. ఈరోజు నుంచి నాలుగు రోజుల్లో మూడు రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. నేడు, రేపు బ్యాంకుకు సెలవులు కాగా.. శనివారం మాత్రమే తెరచుకోనున్నాయి. ఆదివారం రెగ్యులర్ సెలవు అన్న సంగతి తెలిసిందే. శనివారం కూడా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు హాప్ డే నే తెరిచి ఉంచుతారు కనుక.. సోమవారం వరకు పనులను వాయిదా వేసుకోక తప్పదు.
తెలుగు రాష్ట్రాల్లో.. నేడు (ఏప్రిల్ 14) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, రేపు (ఏప్రిల్ 15) గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. శనివారం బ్యాంకులు తెరచుకోనుండగా.. మళ్లీ ఆదివారం సెలవు ఉంది. ఇక ఏప్రిల్ 16న బొహోగ్ బిహు పండుగ సందర్భంగా అస్సాంలో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగలు, ప్రత్యేక రోజుల ప్రకారం సెలవులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన సెలవులు లేవు.