బ్యాంకులకు వరుస సెలవులు.. ఏమైన పని ఉంటే.. వెంటనే చేసేయండి
Banks to have only 2 working days between March 27 and April 4.మీకు బ్యాంకులో ఏదైన పని ఉందా..? వెంటనే ఆ పనిని పూర్తి
By తోట వంశీ కుమార్ Published on 21 March 2021 1:20 PM ISTమీకు బ్యాంకులో ఏదైన పని ఉందా..? వెంటనే ఆ పనిని పూర్తి చేసుకోండి. ఎందుకుంటే బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఇప్పటికే మార్చి నెలలో వరుస సెలవుల కారణంగా బ్యాంక్ లావాదేవీలకు బ్రేక్ పడగా.. మరో 7 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు చూస్తే.. కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా) హాలీడేస్ ప్రకారం.. బ్యాంకులు దాదాపు వారం రోజులు పనిచేయకపోవచ్చు. అయితే.. ఈ సెలవులు రాష్ట్రం, ప్రాంతం ప్రాతిపదికగా మారతాయి.
మార్చి 27 నుంచి 29 వరకు అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. 27న నాలుగో శనివారం కాగా.. 28న ఆదివారం, 29న హోలీ పండుగ. అందువల్ల ఈ మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే మార్చి 30న పాట్నాలో బ్యాంకులకు సెలవు ఉండగా.. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు సెలవు కాకున్నా..బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు. బ్యాంకులు తమ వార్షిక ఖాతాలను మూసివేయడంపై సిబ్బంది కేంద్రీకరిస్తారు. ఏప్రిల్ 1న కూడా బ్యాంక్ సేవలు సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ఇక ఏప్రిల్ 2న గుడ్‌ఫ్రైడే సందర్భంగా వచ్చేనెల రెండో తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు సేవలు అందించలేవు. కాబట్టి ఖాతాదారులు ఏవైన పనులు ఉంటే వెంటనే పూర్తి చేసుకుంటే మంచిది.
మార్చిలో బ్యాంకు సెలవులు:
27 మార్చి: చివరి శనివారం
28 మార్చి: ఆదివారం
29 మార్చి: హోలీ పండుగ
30 మార్చి: పాట్నాలోని బ్యాంకుల శాఖలకు సెలవు
31 మార్చి: ఆర్థిక సంవత్సరం చివరి రోజు
ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవులు:
ఏప్రిల్ 1: బ్యాంకుల్లో ఆర్థిక సంవత్సర ఖాతాల మూసివేత
ఏప్రిల్ 2: గుడ్‌ఫ్రైడే
ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 13: తెలుగు సంవత్సరాది/ గుడి పడ్వా/ ఉగాది
ఏప్రిల్ 14: డడాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి/ తమిళనాడు నూతన సంవత్సర దినోత్సవం/ బిజు/ విషు పండుగ
ఏప్రిల్ 15: హహిమాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం/ బెంగాల్ నూతన సంవత్సర దినోత్సవం
ఏప్రిల్ 16: బోహగ్ బిహు
ఏప్రిల్ 21: శ్రీరామ నవమి