మార్చి చివరి ఆదివారం ఓపెన్‌గానే ఉండనున్న బ్యాంకులు.. ఎందుకంటే..

మార్చి 31తో 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.

By Srikanth Gundamalla  Published on  21 March 2024 10:34 AM GMT
bank,   sunday, march 31st, rbi ,

మార్చి చివరి ఆదివారం ఓపెన్‌గానే ఉండనున్న బ్యాంకులు..ఎందుకంటే..

మార్చి 31తో 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు ఈ నెల 31న యథావిధిగా పనిచేయాలని చెప్పింది. అయితే.. ఈ నెల 31వ తేదీన ఆదివారం వస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్‌గానే ఉండనున్నాయి.

ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్ 1న బ్యాంకులు సెలవుగా పరిగణిస్తాయి. ఇక ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా బ్యాంకు ఆదివారం వస్తుండటంతో ఆ రోజు బ్యాంకులు పనిచేయాల్సిందేనని రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ప్రభుత్వానికి చెందిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు బ్యాంకులను ఆదివారం తెరిచే ఉంచాలని చెప్పింది ఆర్బీఐ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులు కూడా యథావిధిగా ఆదివారం కూడా పని చేయనున్నాయి.

ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ సైతం కార్యాలయాలకు వారంతపు సెలవులను రద్దు చేసింది. ఈ మేరకు ఆదుశాలు జారీ చేసింది. ఆర్‌బీఐ ఆదేశాలతో కెనరా బ్యాంక్‌, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్‌, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌, పంజాబ్ అండ్ సింధ్‌ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఇండస్‌ఇండ్, కరూర్ వైశ్యా, కోటక్ మహీంద్రా, ఆర్బీఎల్ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది.

Next Story