జూన్‌లో బ్యాంకుల‌కు సెల‌వులు ఇవే..

Bank Holidays in June Month list.కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పరిమిత సిబ్బందితో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2021 8:00 AM GMT
జూన్‌లో బ్యాంకుల‌కు సెల‌వులు ఇవే..

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పరిమిత సిబ్బందితో పని చేస్తున్నాయి. అది కూడా తక్కువ సమయమే. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులో పనులు ముందే ప్లాన్​ చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా సెలవుల గురించి. రాష్ట్రాన్ని బట్టి బ్యాంకుల సెలవుల్లోనూ మార్పులు ఉంటాయి. అందువల్ల ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే.. మరో రాష్ట్రంలో సెలవు ఉండకపోవచ్చు. బ్యాంకులో పని ఉండే వారు బ్యాంక్ సెలవులు ముందే తెలుసుకుంటే దానికి అనుగుణంగా బ్యాంక్ కార్యకలాపాలు నిర్వ‌హించుకునేందుకు వీలుంది.

జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..

జూన్ 6 - ఆదివారం

జూన్ 12 - రెండో శనివారం

జూన్ 13 - ఆదివారం

జూన్ 15 - వైఎంఏ డే/ రాజా సంక్రాంతి (మిజోరం, భువనేశ్వర్‌లో బ్యాంకులు పని చేయవు)

జూన్ 20 - ఆదివారం

జూన్ 25 - గురు హర్‌గోవింద్ జయంతి (జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు క్లోజ్)

జూన్ 26 - నాలుగో శనివారం

జూన్ 27 - ఆదివారం

జూన్ 30 - రేమ్నా ని (ఇజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు)

Next Story