జులై నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిరోజులంటే..?
Bank Holidays in July 2021.కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2021 5:21 AM GMTకరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు యథాతథంగా సేవలు అందిస్తున్నాయి. ఏపీలో కర్ఫ్యూ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతోంది. అయితే ప్రజలకు ఆర్థిక లావాదేవిలు అందించేందుకు బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. ఇక జులై లో ఎన్ని రోజులు బ్యాంకులు తెరుచుకుంటాయి. బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకు లావాదేవీలను చేసుకునే వినియోగదారులకు సెలవు దినాలు తెలుసుకుని ముందుగా ప్లాన్ చేసుకుంటే.. పనికి సులభంగా ఉంటుంది.
మొత్తంగా జులై నెలలో దేశ వ్యాప్తంగా 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకు హాలిడేస్.. రాష్ట్రం ప్రాతిపదికన మారుతుంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే మరో రాష్ట్రంలో హాలిడే ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ క్లోజ్ ఉన్నా కూడా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఏటీఏం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు లభిస్తాయి. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రతి ఆదివారం, రెండో శనివారం , నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు ఉంటాయనే సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో సెలవులు..
4 జులై - ఆదివారం
10 జులై - రెండో శనివారం
11 జులై - ఆదివారం
18 జులై - ఆదివారం
21 జులై - బక్రీద్
24 జులై - నాలుగో శనివారం
25 జులై - నాలుగో ఆదివారం
ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే..
జులై 12 - కాంగ్ (రథజత్ర) / రథయాత్ర
జులై 13 - భాను జయంతి
జులై 14 - దృక్ప శేచి
జులై 16 - హరేల
జులై 17 - యు టిరోట్ సింగ్ డే/ కర్చీ పూజ
జులై 19 - గురు రింపోచి తుంగ్ కార్ శేచి
జులై 21 - బక్రి ఈద్ (ఈద్ ఉల్ జుహా) (ఈద్ ఉల్ అదా)
జులై 31 - కేర్ పూజ